News Ticker

Menu

తాజా వార్తలు : బాబు పరీక్షలో టాపర్స్ వీరే!


Latest News List of Topers in TDP,Latest News about AP politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు తన తనయుడు లోకేష్ చేత రహస్యంగా ఒక సర్వేను చేయించారు. ఇక టిడిపి నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సర్వేలో ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి చంద్రబాబు తన క్యాబినెట్ లోని మంత్రులకు గురువారం ర్యాంకింగ్ లు ఇచ్చారు. వారి వివరాలు పరిశీలిద్దాం.
Latest News List of Topers in TDP

* మొదటి ర్యాంక్: భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
* రెండో ర్యాంక్: వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్
*మూడో ర్యాంక్: కార్మిక శాఖామంత్రి అచ్చెంనాయుడు
*నాలుగో ర్యాంక్: వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు
* ఐదో ర్యాంక్ : అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి
*ఆరో ర్యాంక్: పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత
* ఏడో ర్యాంక్: రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు
*ఎనిమిదో ర్యాంక్: ఐటి శాఖామంత్రి పల్లె రఘునాధరెడ్డి
* తొమ్మిదో ర్యాంక్: సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్ బాబు
* పదో ర్యాంక్: పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ
మరి బాబు పరీక్షలో గెలుపొంది మొదటి పది ర్యాంకులను సాధించిన మంత్రులు వీరే. అయితే వీరిలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నేతల, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తదితరులు మొదటి పది స్థానాలలో లేకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఏదిఏమైనప్పటికీ ప్రజా తీర్పుతో మొదటి పది స్థానాలు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులకు అభినందనలు తెలపాల్సిందే మరి.

Share This:

Jillur Rahman

I'm Jillur Rahman. A full time web designer. I enjoy to make modern template. I love create blogger template and write about web design, blogger. Now I'm working with Themeforest. You can buy our templates from Themeforest.

No Comment to " తాజా వార్తలు : బాబు పరీక్షలో టాపర్స్ వీరే! "

Popular Posts

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM